14/04/2026
హిందూపూర్‌లోని బి.ఐ.టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT Institute of Technology) లో ప్రముఖ మల్టీ నేషనల్ సంస్థ SASMOS HET Technologies Ltd., బెంగళూరు ఆధ్వర్యంలో 17.03.2026 మంగళవారం నాడు ప్లేస్మెంట్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్ కార్యక్రమంలో ప్రొడక్షన్ ఇంజినీర్ (Production Engineer) ఉద్యోగాల కోసం విద్యార్థులను ఎంపిక చేశారు.
ఈ నియామక ప్రక్రియలో కంపెనీ HR ప్రతినిధులు ఇశ్వర్య (Iswarya), అర్పిత (Arpitha) మరియు టెక్నికల్ టీమ్ సభ్యులు మిలాన్ (Milan), సంతోష్ (Santhosh) పాల్గొని విద్యార్థులకు పరీక్షలు మరియు ఇంటర్వ్యూలను నిర్వహించారు.
ఈ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో బి.ఐ.టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హిందూపూర్ మరియు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, హిందూపూర్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 40 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డా. పి. చంద్ర మోహన్ గారు మరియు ప్రిన్సిపాల్ డా. ఏ. రమేష్ గారు ఎంపికైన విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్లేస్మెంట్ కార్యక్రమాన్ని ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ సుదర్శన్ రాజు సమన్వయం చేశారు.
భవిష్యత్ లో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపింది