GIPT Alumni

GIPT Alumni Welcome to Govt. Institute of Printing Technology Alumni Students Association.This community page is

The formation of Alumni for GIPT, Secunderabad was always there in every one's mind but somehow it could not materialise for some reasons, the main one being no one came forward to bell the cat. This could become possible because the most liked teacher Sri D. Satyanarayana who is almost a founder of this 35 year old Institute triggered this marvelous development as today 29th February, 2012 happe

ns to be the day when he is retiring from service. There is no better tribute we pay to our beloved teacher (who served this Institute as old as his service) than to start the Alumni body (GIPT AP ALUMNI) so that we can pass on the ideals and practices that our teachers taught us because of which we are all today what we are. We confess that we could not get in touch with every one but once when this Alumni body gets going we will ensure that every one is enrolled and the resulting data base would be of immense help to each other in many respects like sharing of knowledge, research and development, individual experiences, industry-institute interaction to cite a few activities. The major contribution of our Alumni would be of assisting the poor students of the Institute in addition to rewarding meritorious students. This body aims at ensuring that every diploma holder of GIPT shall be employed and see that no one remains unemployed. We solicit every one's cooperation for successful functioning of this Alumni body.

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onb...
30/10/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard!

Mahesh Bathini, Sathya Sathya

Shout out to my newest followers! Excited to have you onboard!Pacific Prints, Raju Madiga
11/04/2024

Shout out to my newest followers! Excited to have you onboard!

Pacific Prints, Raju Madiga

30/03/2024

We need freshers who have completed Diploma in printing, From Hyderabad only for pagination department at vijayawada The Hindu Branch.
kindly provide us the bio data of deserving candidates meeting the above criteria to the mail id mentioned below :
*[email protected]*
*Contact number : 9866542949; 9030212568.*

24/02/2024
Dear GIPT Alumni,It is with profound sadness that we announce the passing of Mr. Ramakrishna Reddy M/s Navya Printers, a...
16/02/2024

Dear GIPT Alumni,

It is with profound sadness that we announce the passing of Mr. Ramakrishna Reddy M/s Navya Printers, a distinguished member of the 1980 batch, early this morning.

A pioneer among us, Mr. Reddy was one of the first from our alma mater to embark on an entrepreneurial path, setting an example and inspiring many fellow GIPT graduates. His legacy of innovation and leadership will always be remembered.

We extend our heartfelt condolences to his family and friends in this difficult time, and we jointly pray for his eternal peace.

31/01/2024

కేడి ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఒక మహా అద్భుతం

ఆర్. వెంకట రెడ్డి (డి సి పి 78)

వనపర్తి కృష్ణ దేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 1959 లో ఏర్పాటైన దగ్గర నుండి చదివిన పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో 28.01.2024 నాడు దశాబ్దాల కాలం తరువాత కలుసుకున్న మిత్రుల ఉద్వేగ భరితం తో కేరింతలతో సెల్ఫీ ఫోటోలతో కళాశాల ప్రాంగణమంత దద్దరిల్లి పోయింది. పూర్వ విద్యార్థులు అడపా దడపా వారి వారి బ్రాంచీల మిత్రులతో కలిసే వారు కానీ అన్నీ బ్యాచులు కలిసి జరుపుకున్న అపురూప వేడుక అని చెప్పాలి.

చెప్పులు లేకుండా కొందరు చిన్న డబ్బా సూతకేసు తో సంచులతో కొందరు బిక్కు బిక్కు మంటూ కళాశాల ప్రాంగణం అడుగు పెట్టిన పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వారి వారి వృత్తులలో దేశ విదేశాలలో సేవలందించి స్థిరపడి సమాజానికి తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించి ఉన్నత వరసలో లో నిలిచి ఈ వేడుకకు పెద్ద పెద్ద వాహనాలలో తరలి వచ్చిన తీరు పూర్వ విద్యార్థులకు ఈ కళాశాల ఉపాధ్యాయులు అందించిన విద్యా బుద్దులు ప్రత్యక్షంగా చూడవచ్చని ముఖ్య అతిధి గా హాజరైన జిల్లా కలెక్టర్ తన ప్రసంగం లో చెప్పినప్పుడు హర్ష డ్వానాలు మిన్నంటాయి.

ఈ కాలేజీ అంటే అంతు లేని ప్రేమ. ఈ గాలి ఈ మట్టి వాసన రాజా ఠీవి ఉట్టిపడే కళాశాల అన్నీ వసతులతో కూడిన హాస్టల్ భవనాలు తలుచుకున్నప్పుడల్లా రోమాలు నిక్క పొడుస్తాయని ఇక్కడ గడిపిన కాలం మరెక్కడా అనుభవం లోకి రాలేదని అందులో చేసిన చిలిపి కొంటె పనులు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు అందుకున్న అవార్డులు టీచర్లతో ఆడిన జోకులు విన్న సీరియస్ పాఠాలు అన్నిటినీ అందరూ నెమరు వేసుకున్నారు. గ్రూపులు గ్రూపులుగా తాము చదివిన తరగతి గదులకు వెళ్ళి మళ్ళీ ఆ బెంచీల మీద కూర్చొని కొన్ని వందల ఫోటోలు దిగి ఒక్కయింత పులకించి పోయారు. కళాశాల ముందు ఫోటోలకైతే కొదవే లేదు. మైక్ లో నిర్వాహకులు హన్మంత రావు మల్లికార్జున రెడ్డి తదితరులు టెన్త్ లోపలికి రమ్మని మైక్ లో అరిచి గీ పెట్టినా కూచ్ భీ జనతా నై కళాశాల ప్రాంగణం అంతా కలియ తిరిగి టెంటు లోపలికి వచ్చి ఒకటే ముచ్చట్లు. శారీరకంగా చాలా మార్పు లు వచ్చాయి కాబట్టి ఒకరి నొకరు పలకరించు కున్నప్పుడు ‘గుర్తు పట్టు’ బుర్ర గీక్కొని గీక్కొని చివరకు నేను రా అని పేరు చెప్పే లోపే గట్టిగా వాటేసుకుని అరుపులు కేకలతో ఆనంద బాష్పలతో కుశల ప్రశ్నలు వేసుకుని ఈ ఇద్దరు ఇంకో కొందరిని దొరికించుకుని రా రా పోరా కొట్టుకుంటా చదువుకునే రోజుల్లో చేసిన సందడి మళ్ళీ అదే సందడి , ఈ సందడి ని వీక్షించడానికి రెండు కళ్ళు కాదు వెయ్యి కళ్ళు కూడా చాలవు.

అయితే కళాశాల ను కలియ తిరుగుతూ కళ తప్పిన కళాశాల వైభవం మాత్రం ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. కళాశాల నిర్వహణ తీరు వెలిసి పోయిన భవనం హాస్టల్స్ అన్నీ కూలిపోయే దశకు రావడం అందులో గంతులేసిన రోజులు మంచి భోజనాలు తిన్న రోజులు గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరి కళ్లు చమర్చాయి. అయ్యో ఎలాగైనా ఈ కళాశాలను తిరిగి పూర్వ వైభవం తీసుకు రావాలని అందరి తపన. కలెక్టర్ ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో ఎదురు చూడడమే కాకుండా తమ వంతు ఏమైనా చేయవచ్చా అనే చర్చలు కూడా చేయడం కనిపించింది. ఈ మట్టి ఎంత పవిత్రమైనదో మిత్రుడు మనోహర్ దురిశెట్టి (81 E), తాను చదివిన ఈ పవిత్ర మట్టిని తన దోసిళ్ళతో కొత్త కండువాలో మూట కట్టుకుని మంచిర్యాల కు తీసుకెళుతున్నాని దీనిని తన ఇంట్లో వ్యవసాయ క్షేత్రం లో వివధ కళాశాలలో చల్లుతానని సభా ప్రాంగణం నుండి ఆ పవిత్ర మట్టి మూటను మనోహర్ భావోద్వేగం తో చూపించి నప్పుడు సభలో ఉన్న వారమంతా అదే భావోద్వేగానికి గురి అయ్యాము. ఈ మట్టి అన్న ఈ గాలి అన్నా మనదరికి ఒక విడదీయరాని బంధం.

కార్యక్రమంలో నిర్వాహకులు ఒక మంచి ఆలోచన తో సూపర్ సూపర్ సీనియర్లకు సన్మానం చేయడం. అదిరింది ఈ ఆలోచన. సూపర్ సీనియర్లు మళ్ళీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని కళాశాల తమకు ఇచ్చిన గౌరవాన్ని చదువును అప్పటి రోజులను గుర్తు చేసుకుని తాము తమ వృత్తులలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో రక్షణ శాఖ లో విద్యుత్ శాఖలో నీటి పారుదల శాఖ లో వారు సాధించిన విజయాలను ప్రజలకు చేసిన సేవలను అందరితో పంచుకుంటూ మళ్ళీ కాలేజీ విద్యార్థుల లాగా మారిపోయారు. రోజు తరగతి కి క్రమం తప్పకుండా పోతే ఉపాధ్యాయులు అంకిత భావంతో ప్రేమతో చెప్పిన పాఠాలు వింటే చాలట ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ అని ఈ కాలేజి గొప్పదనాన్ని బోధించే టీచర్ల నైపుణ్యతను చెప్పుకొచ్చారు. కొందరు కవిత్వం చదివారు కొందరు జోకులు వేశారు. వారిని సన్మానించి గ్రూపులు గ్రూపులు వారితో ఫోటోలు దిగడం వారికి ఇచ్చిన గొప్ప సన్మానమే. సూపర్ సీనియర్లె కాదు సమయం లేక కానీ అక్కడకు వచ్చిన ఎవ్వరిని కదిలించినా వారు చేసిన చేస్తున్న పనిని చెప్పే అవకాశం ఇస్తే వేల పేజీల పుస్తకమే అవుతుందని పించింది.

మళ్ళీ కలిసే నాటికి మాలో కొంత మందిమి ఈ భూమి నుండి సెలవు తీసుకోవచ్చు, ఆరోగ్యాలు సహకరించకపోవచ్చు. ఈ కలయిక మాత్రం ఒక అద్భుతం.

చివరగా.. ఈ అద్భుతానికి మూల కారకులైన నిర్వాహకులు మనలో నుండే ఉద్భవించడం మనందరికీ గర్వ కారణం. ఒక ఆలోచన రావడం ఆలోచనను ఆచరణ లో పెట్టడానికి పలు సమావేశాలు నిర్వహించడం ఈ సమావేశాలలో కొన్ని సార్లు ఉత్సాహం కొన్ని సార్లు నిరాశ చెందడం అసలు ఈ కార్యం ముందుకు సాగుతుందా అని కొంత మంది సభ్యులకు అనుమానాలు రావడం. సమస్యే లేదు చేసి తీరుదాం అని వెంకటేశ యాదవ్ తొర్రి ముసి ముసి నవ్వులతో అందరికీ సర్ది చెప్పడం. హన్మంత రావ్ పట్టు వదలని విక్రమార్కుని వలె అందరినీ తట్టి లేపడం డీలా పడుతున్న వాళ్ళను గమనించి హుషారు చేయడం ప్రతి సమావేశం మినట్స్ రాసి సభయుయలకు తెలియ చేయడం. కొన్ని సమావేశాలకు పాత వారు డుమ్మా కొట్టడం కొత్త వారు రావడం వాళ్ళకు మళ్ళీ పూస గుచ్చి నట్లు గత నిర్ణయాలు వివరించడం,కొత్త ఆలోచనలను స్వీకరించడం కొంత మంది మిత్రులు నగరం లో జరిగిన తయారీ మీటింగులలో భోజనాలు ఏర్పాటు చేయడం ఎన్ని తెర వెనుక పనులు అంటే చెప్పలేనాన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా కుదిరిందో ఏమో కానీ వెంకటేశ హన్మంత రావ్ ల జోడీ బలే పర్ఫెక్ట్ గా కొంత మంది యువ కేడీఆర్ మిత్రుల మద్దతు తో ఈ కార్యక్రమ రథ సారథులై నిలిచారు. రథానికి ఉన్న నట్ బొల్టులు అప్పుడప్పుడు లూజ్ అయినప్పుడు రథం గాడి తప్పుతున్నప్పుడు లూజైన నట్ బొల్టులను బిగించి మళ్ళీ దారికి తేవడం వారికే సాధ్యమయ్యింది. వాట్సప్ లో వందలాది మంది సభ్యుల యక్ష ప్రశ్నలు డబ్బులు పంపిన స్క్రీన్ షాట్ల కు సమాధానాలు కన్ఫూజ అయితరని చెప్పిందే బల్ల గుద్ది మరి మరి ఓపికగా సమాచారం ఇవ్వడం ఎంతో సాహసం తో కూడిన ప్రక్రియ. ఉపేందర్, కళ్యాణ్ లాంటి మిత్రులు ఇంకా కొంత మంది యువ మిత్ర బృందం మెమున్నామని భరోసా నివ్వడం భోజనాలకు స్థానిక మిత్రులు పయిలం సంతోష్ ఆధ్వర్యం లో ముందుకు రావడం కుమార స్వామి తన భుజాన కొన్ని బాధ్యతలు వేసుకోవడం మరియు ఈ అద్భుత సృష్టి కి కారకులైన కొంత మంది మిత్రుల పేర్లు ప్రస్తావించక పోవడం కేవలం గుర్తుకు రానందున మాత్రమే అని సహృదయంతో అర్ధం చేసుకుంటారని మనవి. ఇంత మంది ఇన్ని కార్యక్రమాలు శ్రమకోర్చి కలబోసిన కార్య నిర్వహననే ఈ మహా అద్భుతం.

ఈ అద్భుతాన్ని ఆస్వాదించడానికి మా అందరికీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా వందనాలు. బొందిలో ప్రాణముండగా మళ్ళీ కలుద్దాం తప్పక. ఆనంద బాష్పలతో.... సెలవు

మీ కేడీఆర్ మిత్రుడు

వెంకట రెడ్డి

నైజీరియాలో GIPT పూర్వ విద్యార్ధి కి అరుదైన గౌరవం--------------------------------------------------------ఆఫ్రికా దేశం నైజ...
17/12/2023

నైజీరియాలో GIPT పూర్వ విద్యార్ధి కి అరుదైన గౌరవం
--------------------------------------------------------

ఆఫ్రికా దేశం నైజీరియా లో GIPT పూర్వ విద్యార్ధి కి అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ప్రభుత్వం ప్రదానం చేసే “ చీఫ్” హోదా ని అందుకున్న మొదటి తెలుగు వారుగా శ్రీ కండె వెంకటేశ్వర్లు గుర్తింపు సాధించారు. నైజీరియా దేశంలో అనంబ్రా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా తమ దేశస్తులతో పాటు తమ రాష్ట్ర ప్రగతి లో భాగస్వాములైన ఇతర దేశస్థులకు ఈ అవార్డు ఇస్తుంది. ఇక విషయానికి వస్తే కండె వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా ఒంగోలు లో జన్మించారు. విద్యాభ్యాసం అంతా కావలి లో జరిగింది. తరువాత హైదరాబాద్ లో ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సు లో డిప్లొమా చేసి ఉద్యోగ నిమిత్తం 2004 లో దుబాయ్ వెళ్లారు. రెండు సంవత్సరాలు అక్కడ పని చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కరెన్సీ ముద్రణ సంస్థలో ప్రభుత్వ ఉద్యోగం లో చేరారు. ఆ ఉద్యోగం సంతృప్తి కలగకపోవటం తో 2008 లో రాజీనామా చేసి నైజీరియా లో ఓ ప్రముఖ కంపెనీ లో మేనేజర్ గా చేరారు. అక్కడే ఆఫ్రికా లో ఉన్న అపారమైన అవకాశాలను చూశారు. అక్కడున్న ప్యాకేజింగ్ కంపెనీలు స్థానిక అవసరాల్ని తీర్చలేకపోతున్నాయని గమనించి 2010 లో మళ్ళీ దుబాయ్ కి వచ్చి అక్కడ మరో పెద్ద సంస్థలో మేనేజర్ గా చేరారు. ఇక అక్కడినుండి ఆఫ్రికా దేశాలకు తమ సంస్థ ఉత్పత్తులని మార్కెటింగ్ చేయటం మొదలు పెట్టారు. ఆనతి కాలంలోనే నైజీరియా తో సహా దాదాపు ఆఫ్రికా ఖండంలో ఉన్న 25 దేశాల్లో తమ సంస్థ ఉత్పత్తులని నమ్మకంగా అందించటం ద్వారా నమ్మకమైన విక్రయ దారుగా ఆయా దేశాల్లో తనదైన ముద్ర వేసారు. 2021 లో తానే సొంతంగా దుబాయ్ లో Fortune Pack అనే పరిశ్రమ ని స్థాపించి నైజీరియా కి మరియు ఇతర దేశాలకు తమ ఉత్పత్తులని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు.
అయితే గత పదమూడేళ్లు గా తమ దేశానికీ విలువైన సేవలు అందించినందుకు , తద్వారా తమ ఆర్ధిక ప్రగతి కి దోహదం చేసినందుకు , కండె సేవలని గుర్తించి అక్కడి ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందించింది. ఈ వార్త విన్న ఒంగోలు , కావలి వాసులు , తనతో చదువుకున్న GIPT మిత్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Dear Gipt Alumnus, Yesterday  GIPT Alumni family suffered a terrible loss. Shri THOTA SHANTI RAJU, PROCESS ASSISTANT, BR...
22/08/2023

Dear Gipt Alumnus,

Yesterday GIPT Alumni family suffered a terrible loss. Shri THOTA SHANTI RAJU, PROCESS ASSISTANT, BRBNMPL (97 batch) has passed away in SHILIGURI. May his soul rest in eternal peace.

2000 బ్యాచ్ కి చెందిన ఆదిశేషు ఆకస్మిక మరణం బాధాకరం. తన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. We miss you 😥
07/02/2023

2000 బ్యాచ్ కి చెందిన ఆదిశేషు ఆకస్మిక మరణం బాధాకరం. తన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. We miss you 😥

98 batch and out teachers
22/05/2022

98 batch and out teachers

At the marriage of Gampa Srinivasa Rao’s daughter.
15/04/2022

At the marriage of Gampa Srinivasa Rao’s daughter.

Address

Hyderabad

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when GIPT Alumni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to GIPT Alumni:

Share