22/10/2021
YN కాలేజ్ ఎవరి వ్యక్తిగత సొమ్ము కాదు, ఇది ప్రజల ఆస్తి-ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐ.వి)
రైతులు సార్వా, దాళ్వా పంటలు కళాశాల అభివృద్ధి కి దానంగా ఇచ్చారు- రెడ్డప్ప దవెజి
YNకళాశాలను కాపాడుకుందాం, ప్రయివేటీకరణను ఆపాలి అని SFI YN కళాశాల కమిటీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం స్థానికి అంబెడ్కర్ భవనంలో జరిగింది.. దీనికి YN కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు వి.మహేష్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ MLC లు ఐవి, సాబ్జి మాట్లాడుతూ YN కళాశాలను ప్రయివేటీకరించిన తరువాత పేద,మధ్యతరగతి విద్యార్థులు వేల రూపాయలు ఫీజులు ఎలా కడతారని ప్రశ్నించారు.. సాహితీ వేత్త రెడప్ప దవేజీ మాట్లాడుతూ గతంలో చుట్టుపక్కల రైతులు దాళ్వా, సార్వా పంటలు దానంగా ఇచ్చి కాలేజ్ అభివృద్ధి కి సహకరించారని తెలిపారు, YN కళాశాల ఆడిటోరియం పూర్వ విద్యార్థుల శ్రమ దానంతో కట్టింది.మీకు పేరు, ప్రతిష్టలు కావాలి అనుకుంటే కళాశాలను మీ పేరుమీద నామకరణం చేసుకోండి. అంతేగాని పేద మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి కళాశాలను ప్రభుత్వసంస్థ గా మార్చాలి దాతల ఆశయాలు నెరవేర్చాలి.ఈ ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులకు తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు మద్దతిచ్చి ప్రోత్సహించాలన్నారు. "విద్యార్థులపై కేసులు పెడతాం,లాబ్ మార్క్స్ తగిస్తాం,సర్టిఫికెట్స్ నిలిపివేస్తాం అని కళాశాల యాజమాన్యం బెదిరించడం మరియు విద్యార్థి నాయకుల ఇళ్లకు పోలీసుల్ని పంపించడం సరికాదు అని అలాంటి సంఘటనలు జరిగినప్పుడు న్యాయవాదులుగా తాము విద్యార్థులకు అండగా ఉంటామని చదలవాడ జ్ఞాన ప్రకాష్ మరియు ఇతర అడ్వకెట్లు అన్నారు. న్యాయమైన డిమాండ్ పై పోరాడుతున్న విద్యార్థులపై వేధింపులు ఆపాలి అని పలువురు వక్తలు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దొండపాటి స్వామి విద్యార్థులు పోరాటానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు, జనసేన నాయకులు నళిని, సీపీఎం నాయకులు త్రిమూర్తులు, సీపీఐ నాయకులు నెక్కంటి క్రాంతి కుమార్, పట్టణ ప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు..
పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని, కళాశాలను ప్రభుత్వ విద్యాసంస్థ గా మార్చాలి అని YN కళాశాల యాజమాన్యం కి లేఖలు వ్రాయాలి అని రౌండ్ టేబుల్ నుండి పిలుపునిచ్చారు.