25/08/2026
యువకవులకు సిద్ధార్థ కళాపీఠం ఆహ్వానం
విజయవాడ, ఆగస్టు 25: ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, పి.బి.
సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు విభాగం సంయుక్త నిర్వహణలో ఈనెల
29న విజయవాడ సిద్ధార్థ కళాశాల సెమినార్ హాలులో నగరంలోని వివిధ కళాశాలల
విద్యార్థులతో యువకవితా గానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిద్ధార్థ కళాపీఠం
ప్రధాన కార్యదర్శి నిమగడ్డ లలితప్రసాద్ తెలిపారు. మంగళవారం పి.బి. సిద్ధార్థ
వెబినారు హాలులో యువ కవితాగానం కరపత్రం విడుదల కార్యక్రమంలో ఆయనతోపాటు
కళాపీఠం కార్యదర్శి బివిఎస్ ప్రకాశ్, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్
ఆచార్య రాజేష్ సి.జంపాల, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మనోరంజని, తెలుగు
విభాగాధిపతి డాక్టర్ సశ్రీ పాల్గొన్నారు. ఆసక్తి ఉన్న కళాశాల విద్యార్థులు,
ఔత్సాహిక కవులు శనివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే యువ
కవితాగానంలో పాల్గొనేందుకు 9989844001 ఫోన్ నెంబరును సంప్రదించాలని వారు
కోరారు. అనంతరం 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు యువకవులతో ముఖాముఖి
కార్యక్రమం నిర్వహిస్తారు. వర్ధమాన కవులు సోమేపల్లి శ్రీవశిష్ఠ, పిటి పార్కర్,
తులసీ పద్మశ్రీ, నానా, కొల్లి సనత్ కుమార్ కవితానిర్దేశం చేస్తూ విద్యార్థులతో
తమ అనుభవాలు పంచుకుంటారు.