Sri Krishnadevaraya University M.C.A

Sri Krishnadevaraya University M.C.A it is place where we started our journey of life and learned lot of things( not subject�) and we shared joy love each and every thing # thank u cst���

Credits-sku adda
10/08/2020

Credits-sku adda

View from. Mandakini hostel
02/08/2020

View from. Mandakini hostel

31/07/2020
Journalism at its best
09/11/2019

Journalism at its best

పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెత విన్నార ఎప్పుడైనాఅలా ఎందుకు అన్నారు అసలు ,,, దాని వెనుక కధ ఏంటి ఈ రోజు చూద్ద...
08/06/2019

పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెత విన్నార ఎప్పుడైనా
అలా ఎందుకు అన్నారు అసలు ,,, దాని వెనుక కధ ఏంటి ఈ రోజు చూద్దాం అండి

#పులస_చేప - మన గోదావరి జిల్లాలో లభిస్తుంది దీని ఖరీదు కేజీ సుమారు 3 వేల నుండి 5 వేల వరకు ఉంటుంది ఒక్కోసారి డిమాండ్ బట్టి 8 వేల రూపాయలు కూడా ఉంటాదండి . దీనిని అమ్మెటప్పుడు పాట ( bidding ) వేస్తారు ఒక్కొకరు ధర పెట్టి పాడుకుంటారు. ఈ చేప గొప్పతనం ఏమిటంటే ఎక్కడో ఆస్ట్రేలియా లో పుట్టి, న్యూజిలాండ్ వస్తుంది అక్కడ నుండి టాంజినీయా దేశం తర్వాత హిందూమహాసముద్రంలో కలిసి అక్కడ నుండి బంగాళాఖాతం లోకి వస్తుంది. ఎప్పుడైతే గోదావరిలో ఎర్ర నీరు వస్తుందో ఆ శ్రేష్టమైన మంచినీటిని త్రాగడానికి గోదావరి సముద్రం కలిసే అంతర్వేదిలో ఇవి ఎదురీది గోదావరిలోకి వస్తాయి. ఇక్కడ కొన్ని గుడ్లు కూడా పెడతాయి అనంతరం మళ్ళీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. అలా గోదావరి లోకి ఎదురిదుతూ వచ్చి తిరిగి సముద్రంలో కలిసే మధ్యలో మన జాలర్లు వీటిని పట్టుకుంటారు. ప్రవాహానికి ఎదురు ఈడుతుంది మాములుగా అలా ఎదురు ఈదే చేపలు చాలా వరకు చచ్చిపోతాయి. దీనికి ముల్లులు ఎక్కువగా ఉండటం వలన అలా ఎదురు ఈదగలుగుతుంది. కాని ఒక్కసారి ఒలలో పడగానే చనిపోతుంది. సముద్రంలో ఉన్నపుడు దీనిని ఇలస అని అంటారు. ఎప్పుడైతే గోదావరిలో కలుస్తుందో అప్పుడు దీనిని పులస అంటారు. ఇలస గా ఉన్నప్పుడూ దీని ధర కేవలం 70 నుండి 120 రూపాయలు మాత్రమే ఉంటుంది. పులస గా మారిన తర్వాత దీని రేటు అమాంతం పెరిగిపోతుంది. పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అని ఊరికే అనలేదు దీని రుచి అలాంటిది ఒక్కసారి పులస చేప కూర తింటే ఇంకా మిగతావి అన్నీ దీని ముందు తక్కువగానే అనిపిస్తాయి ( ధర గురించి కాదు - రుచి పరంగా )....

ఒరిస్సా నుండి సేమ్ ఇలానే ఉండే చేపలు ఇక్కడకు తెచ్చి బురిడీ కొట్టించి అమ్మేస్తారు వీటి డిమాండ్ ను క్యాష్ చేసుకోవడం కోసం వీటిని గుర్తించడం చాలా తక్కువ మందికే తెలుస్తుంది అందులో పెద్ద వారు అయితే బాగా గుర్తిస్తారు ఇవి వెండి రంగులో మెరుస్తాయి నోటి దగ్గర పసుపు రంగు పోలి ఉంటాయి. ఈ పులసలో మళ్ళీ రెండు రకాలండోయ్ ఒకటి పోతు పులస మరోటి సెన పులస ... దీనిలో ఆడ పులస అంటే సెన పులసి కి మరింత డిమాండ్ ఎక్కువ

పులస తెచ్చేస్తే సరిపోదు అండి అది వండే విధానం కూడా తెలియాలి ... పులస కూరలో లేత బెండకాయలు వేసి బాగా మగ్గిన తర్వాత అలానే పక్కన పెట్టేసి ఆ తర్వాత రోజు తినాలి ... వండిని రోజు కంటే ఆ రోజు వదిలేసి తర్వాత రోజు తింటే జన్మలో మర్చిపోరు. ఏంటి కూర కి అంత బిల్డప్ అవసరమా అనుకుంటారేమో ... దాని రుచి అలాంటిది కాబట్టి ఇంతలా చెప్తున్నానండి ... ఓ పాలి మీరు కూడా తినండి నిజంగా చాలా బాగుంది అంటారు. అన్నట్టు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారు ఇదంతా అనుకుంటారేమో పులస సంవత్సరంలో దొరికేది మూడు నెలలు మాత్రమే నండి అది కూడా వచ్చే జులై నెల, ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో మాత్రమే వీటి కోసం మన గంగపుత్రులు ప్రాణాలను సైతం పలంగా పెట్టి పట్టుకుంటారండి గోదారిలో ఆయ్

Note ; ఎప్పుడు చెప్పేదే ఈ పోస్ట్ ని కాపీ చేసుకుంటే కూసంత క్రెడిట్ కూడా ఇవ్వండి మరి ఆయ్

 #రాయలసీమ.. మల్లెపూల ఇడ్లిలు....అనంతపురం లో తెల్లగా తల తల లాడే ఇడ్లిలకు ప్రసిద్ది...ప్రపంచ ఇడ్లి దినోత్సవం రోజు మీకోసం.....
30/03/2019

#రాయలసీమ..
మల్లెపూల ఇడ్లిలు....
అనంతపురం లో తెల్లగా తల తల లాడే
ఇడ్లిలకు ప్రసిద్ది...
ప్రపంచ ఇడ్లి దినోత్సవం రోజు మీకోసం..
ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి ఇడ్లిలు..
అవును మీరు అందరూ అన్ని ప్రాంతాల వారు
ఇడ్లిలు తినిఉంటారు..కానీ మా రాయలసీమ..
ఇడ్లిలు తిన్నారా.. అయితే ఒక సారీ తిని చుడండి..
ఇడ్లిలు..చెన్నికాయల చెట్నీ. ..అది కూడా కారం గా..
ఒక్క ఇడ్లి లేకి రెండు సార్లు చెట్నీ వేసుకొని తింటాం
మా వాళ్ళు ఎర్రకారం కూడా వేస్తారు అక్కడక్కడా..
మీరు సాంబార్ తోనో పప్పుల చెట్నీ తోనో తినిఉంటారు..
ఒక్కసారి మా రాయలసీమ లో పండిన చేనికాయల
చెట్నీతో తిని చుడండి..
ఇంక మీ పప్పుల చెట్నీ కొబ్బెర చెట్నీ పక్కకు పెట్టకుంటే.....నన్నడగండి....
అనంతపురం..శ్రీకంటం సిర్కిల్ లో రెండు మూడు సాట్ల
ఈ ఇడ్లిలు దొరుకుతాయి..
వేడి వేడిగా ఇలా తెస్తే అలా ఐపోతుంటాయి..
ఇడ్లిల కోసం ఒక్కోసారి లైన్ లో నిలబడి మరి తినాల్సి
వస్తుంది అంటే అతిశయోక్తి కాదు..
బయటి వాళ్ళు ఎప్పుడన్నా అనంతపురం వస్తే
ప్రయత్నించండి..మా ఇడ్లి..చేనికాయల చట్నీ ని..
టీం రాయలసీమ రుచులు..

Address

Anantapur
515003

Alerts

Be the first to know and let us send you an email when Sri Krishnadevaraya University M.C.A posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share