30/07/2020
ెంట్అఫైర్స్
ంతర్జాతీయ_అంశాలు
A).ఆస్ట్రేలియా పౌరసత్వం పొందుతున్న వారిలో మొదటి స్థానంలో భారతీయులు ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 2 లక్షల పొరసత్వాలు మంజూరు చేయాగా భారతీయులు 38209 మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 60 శాతం అధికం. భారతీయులు తర్వాత 2వ స్థానంలో బ్రిటిష్ వారు 25011 మంది, చైనీయులు 14764 మంది, పాక్ జాతీయులు 8821 మంది పౌరసత్వం పొందారు.
B).కాలాపాని ప్రాంతానికి అక్రమంగా నేపాల్ దేశం తమ పౌరులను పంపడాన్ని నిలిపివేయాలని భారత్ కోరింది. కాలాపాని ప్రాంతంతో పాటు లింపియాదుర, లిపులేఖ్, గూంజ్ ప్రాంతాల్లోకి నేపాల్ పౌరులు అక్రమంగా వస్తున్నారు. అయితే ఈ ప్రాంతాలు తమ దేశానికీ చెందినవని నేపాల్ అధికారులు తెలిపారు.
ాతీయ_అంశాలు :
A).జాతీయ విద్యా విధానం : డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ విద్యా విధానానికి 29-07-2020న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనిప్రకారం HRD మంత్రిత్వ శాఖ పేరు విద్య శాఖగా మార్చనున్నారు. జాతీయ విద్య విధానాన్ని తొలుత 1968లో, తర్వాత 1986లో, దానికి 1992లో పరిమితంగా సవరణలు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే 1986 విధానమే 34 ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. దానిస్థానంలో కొత్త విధానం రుపాదించడానికి కేంద్రప్రభుత్వం 2016 మే27న TSR సుబ్రహ్మణ్యం కమిటీ, 2019 మే 31న కె. కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేసింది. కె. కస్తూరి రంగన్ కమిటీని నివేదికను ఇప్పుడు ప్రభుత్వం ఆమోదించింది. పాఠ్యక్రమాలు నిర్మాణాన్ని మారుస్తున్నారు . ప్రస్తుతం 10+2+3 విధానం నుండి ఉంది. ఇప్పుడు ఆ విధానాన్ని 5+3+3+4 ఏళ్ల పాఠ్యక్రమ విధానాన్ని తీసుకొస్తున్నారు.
B).జమ్మూ కాశ్మిర్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం భూమి అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మిర్ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 31న స్థానికత చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టం క్రింద స్థానికత నిర్వచనాన్ని మార్చి భారతీయులు ఎవరైనా జమ్మూ కాశ్మిర్ రాష్ట్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే కొన్ని షరతులకు లోబడి ఇతర ప్రాంతాల వారు సైతం స్థానికులుగా గుర్తింపు తీసుకోవచ్చును.
ంధ్రప్రదేశ్ :
ప్రపంచ పులుల దినోత్సత్సవం ( జులై 29 ) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ రూపొందించిన పోస్టరును ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పారెస్టు 3727.82 చ.కి.మీల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడ 60 పూలులు ఉన్నాయి.
్థిక_అంశాలు :
వ్యవసాయ రంగానికి ఈ సంవత్సరం రూ. 1.29లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కౌలు రైతులకు 6500 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్దేశించారు. గత ఏడాదితో పోలిస్తే సాగుకు రుణ లక్ష్యం 11.90% పెంచారు.
ైన్స్_అండ్_టెక్నాలజీ:
A).రఫేల్ యుద్ధ విమానాలు: రఫేల్ యుద్ధవిమానాలు తయారు చేయు సంస్థ, ప్రాన్స్ దేశానికి చెందిన దసో ఏవియేషన్. సెప్టెంబర్ 23 2016 న భారత్,ఫ్రాన్స్ ల మధ్య ₹59,000 కోట్ల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం దసో ఏవియేషన్ మన దేశానికి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను 2021 సంవత్సరాంతం లోపు సరఫరా చేయవలసి ఉన్నది. భారత్కు అందే 36 యుద్ధవిమానాల్లో ఆరు శిక్షణ విమానాలు ఉంటాయి. ప్రస్తుతానికి 10 విమానాలను లాంఛనంగా ఫ్రాన్స్ మనకందించింది. అందులో ఒక అయిదు 29-07-2020 న భారత్ లోని హార్యానా రాష్ట్రంలోని అంబాల వద్ద యుద్ధ వైమానిక స్థావరం వద్ద దిగాయి. వీటిలో 2 సింగిల్ సీటు విమానాలు.మిగిలిన 3 డబుల్ సీటు శిక్షణ విమానాలు. మరో అయిదింటిని ఫ్రాన్స్ లోనే ఉంచి భారత పైలెట్లకు శిక్షణ నిస్తున్నారు. రఫేల్ అంటే ఫ్రెంచ్ భాషలో ‘ *గాలిదుమారం* ’ అని అర్థం. పేరుకు తగ్గట్టే అది భారత ప్రత్యర్థుల పాలిట గాలి దుమారం కానుంది. ఇప్పటికే ఫ్రాన్స్, ఈజిప్ట్ వంటి దేశాల వద్ద రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. అయితే భారత్కు వచ్చేవి అత్యంత అధునాతనమైనవి.
B).రఫేల్ తొలి భారత పైలట్గా హిలాల్ : ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్గా ఎయిర్ కామడొర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు. కశ్మీర్కు చెందిన హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుంచి జూలై 27న బయలుదేరిన తొలి బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం పొందారు. భారతీయ అవసరాలకు అనుగుణంగా రఫేల్ను మార్చే ప్రక్రియలోనూ ఆయన పాలు పంచుకున్నారు. భారత వైమానిక దళ అధికారిగా మిరేజ్ 2000, మిగ్ 21, కిరణ్ యుద్ధ విమానాలపై 3 వేల ఫ్లైయింగ్ అవర్స్ను విజయవంతంగా, ప్రమాద రహితంగా ముగించిన చరిత్ర ఆయనకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్గా ఘనత సాధించారు.దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్లో హిలాల్ జన్మించారు. ఆయన తండ్రి మొహమ్మద్ అబ్దుల్లా రాథోడ్ జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పనిచేశారు. తన కెరీర్లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్ను హిలాల్ సాధించారు.
#6క్రీడలు:
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ ( నాడా ) IPL ( indain premier league ) లో తొలిసారిగా డోప్ పరీక్షలు నిర్వహించనున్నది. 2019 నుండి బీసీసీఐ నాడా పరిధిలోకి వచ్చింది. దింతో ఈ ఏడాది నుండి ఐపీల్ నందు నాడా పరీక్షలు చేయనుంది.
ార్డులు :
విశాఖపట్నానికి చెందిన CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్త వి.వి.స్ శర్మ గారికి ఓషన్ సైన్సు & టెక్నాలజీ జాతీయ అవార్డు లభించింది
ఉద్యోగ సాధనలో ఉన్న మిత్రులకు నోటిఫికేషన్స్ సమాచారం అందించడానికి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆసక్తి ఉన్నవారు జాయిన కావాలని విజ్ఞప్తి.
YouTube ఛానల్ లింక్:
https://www.youtube.com/channel/UCJSqw2AbquU2CBnlvRK9OJg?view_as=subscriber
ెలిగ్రామ్_గ్రూప్_లింక్:
https://t.me/joinchat/KCyZ0VJdW7DSvx8Y0jSBLw
ాట్సప్_గ్రూప్_లింక్:
https://chat.whatsapp.com/ClcwqsAJAln0tM23D3IZlY
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లేటెస్ట్ జాబ్స్ , ఎడ్యుకేషన్ Updates కొరకు యూట్యూబ్ ఛానల్ క్రింది లింకుపై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చెయ్యండి.
వీరవల్లి వేంకటేశ్వర రావు, M.A (ECONOMICS)., M.A (HISTORY)., M.Ed.,
AP-TS SET 2014 Qualified., Cell: 9533334463, 9989491671,
సోషల్ స్టడీస్ టీచర్ , పశ్చిమ గోదావరి జిల్లా.,