27/07/2026
ఈ రోజు (27-07-2026) ఉస్మానియా యూనివర్సిటీ నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు భారీ సంఖ్యలో కలిసి, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ గడ్డం మల్లేశం గారిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున ప్రొఫెసర్ మల్లేశం గారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రస్తుతం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఉన్న ఉద్యోగ సంబంధిత అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
అందుకు స్పందించిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం మల్లేశం గారు ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఒక ప్రత్యేక రోజును కేటాయించి కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమగ్ర సమావేశం నిర్వహించి, అన్ని సమస్యలపై కూలంకషంగా చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆయన సానుకూల స్పందనకు కాంట్రాక్ట్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లేశం గారు ఉద్యోగులను ఎంతో ఆప్యాయంగా పలకరించి, అందరితో మమేకమయ్యారు.
అనంతరం భారీ సంఖ్యలో హాజరైన కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి కోటి మహిళా కళాశాల దర్బార్ భవనం ఎదురుగా జ్ఞాపకార్థంగా సామూహిక ఫోటో దిగారు.
ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల అధ్యక్షులు యారాల రాజేష్ గారు, సురేష్ గారు, రహీం గారు, షబానా మేడం గారు, సాంబశివరావు గారు, శేఖర్ గారు, సతీష్ గారు, జగదీష్ గారు, ప్రియా గారు, స్వాతి గారు, సుమలత గారు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.