Potti Sreeramulu Telugu University

Potti Sreeramulu Telugu University Potti Sreeramulu Telugu University is one of the few language universities in the country.

It was established as "Telugu University" on 2nd December 1985 through an Act of Legislation (Act No. 27 of 1985) with head quarters at Hyderabad and campuses at Sri Sailam and Rajahmundry. Later in the year 1989 the Siddhendra Kalakshetram at Kuchipudi merged with the University. The School of Folk and Tribal Lore was established at Warangal during the year 1994.

13/07/2026

తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి

🚩 రేపు – 13వ రోజు రిలే నిరాహార దీక్ష

తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. నాంపల్లి క్యాంపస్ పరిరక్షణ కోసం మన ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతోంది.

ఈ పోరాటంలో ప్రతి విద్యార్థి, పరిశోధకుడు, అధ్యాపకుడు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థి, విద్యార్థి సంఘ నాయకులు మరియు తెలుగు భాషాభిమానులు తప్పనిసరిగా పాల్గొని తమ మద్దతును తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

📍 వేదిక: దీక్షా ప్రాంగణం, నాంపల్లి క్యాంపస్
🕥 సమయం: ఉదయం 10:30 గంటలకు

"మన విశ్వవిద్యాలయం – మన బాధ్యత. నేడు రాకపోతే రేపు అవకాశం ఉండకపోవచ్చు. అందరూ తప్పకుండా దీక్షా ప్రాంగణానికి చేరుకుందాం."

జై తెలుగు... జై తెలుగు విశ్వవిద్యాలయం!

13/07/2026
12/07/2026

తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగింపు

ఈ రోజు తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ రోజు రిలే నిరాహార దీక్షల్లో భాగంగా తెలుగు భాషా విభాగం విద్యార్థులు వినూత్న కార్యక్రమాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు విశ్వవిద్యాలయం ఎంత ముఖ్యమో వివరిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి గారు తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కార్యక్రమం కోరకు హజరవగా దీక్షా శిబిరాo లో విద్యార్థులు అడ్డగించారు. మీరు కూడా పాత విద్యార్థులే కాబట్టి మీరు కుడా యూనివర్సిటీ సంరక్షణ కి తోడ్పడలాని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే వరకు దీక్షలను మేము కొనసాగిస్తాము అని విద్యార్థులు తెలిపారు.

అనంతరం మాజీ ఉపకులపతి ఎన్. గోపి గారు దీక్షా ప్రాంగణానికి విచ్చేసి ఉద్యమానికి తన సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు.
ప్రభుత్వం ఇరు పక్షాలను చేర్చి సముచితమైన నిర్ణయం చెయ్యాలని, తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తూ, విశ్వవిద్యాలయ ఆస్తులు, వారసత్వం, చరిత్రను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం న్యాయమైన నిర్ణయం తీసుకుని విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.

 నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడాలని భారీ నిరసనవిద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, మేధావుల ఐక్య గళంహై...
03/07/2026


నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడాలని భారీ నిరసన
విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, మేధావుల ఐక్య గళం

హైదరాబాద్, జూలై 2:

నాంపల్లి ప్రాంగణంలోని తెలుగు విశ్వవిద్యాలయాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ నేడు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, సాహితీ–సాంస్కృతిక వర్గాలకు చెందిన ప్రముఖులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్తలు తదితరులు పాల్గొని ప్రభుత్వం ఇప్పటికే ఆద్యకళకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించిన మళ్లీ తిరుమలరావు, కోదండరాం ఎ ముఖం పెట్టుకోని తెలుగు విశ్వవిద్యాలయంలో కాలు మోపారని ప్రశ్నించారు. తెలుగు విశ్వవిద్యాలయ స్థలాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ విశ్వవిద్యాలయాన్ని బలహీనపరిచే చర్యలను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలోనే కొనసాగాలని, ఇప్పటికే ఆద్యకళ ఆధీనంలో ఉన్న పాత వస్తువులు, సామగ్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తగిన మ్యూజియంకు తరలించాలని సూచించారు. ఆద్యకళ వారసత్వంపై నిజమైన అభిమానం ఉంటే, ఆ వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉండే ప్రత్యేక మ్యూజియంలో భద్రపరచడం ఉత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో జ్యోతిష్యం, యోగా, బి.డిజైన్, పద్యనాటకం, దూరవిద్యతో పాటు పలు కోర్సుల్లో 2,500 మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, ప్రస్తుతం ఉన్న తరగతి గదులే సరిపోని పరిస్థితి ఉందని వక్తలు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో మరిన్ని గదులను ఇతర అవసరాలకు కేటాయించడం వల్ల విద్యార్థుల విద్యా కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఆద్యకళ ఆధీనంలో ఉన్న గదులను తిరిగి విశ్వవిద్యాలయానికి అప్పగించి, విద్యార్థుల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

నిరసనలో పాల్గొన్నవారు "తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడాలి", "నాంపల్లి ప్రాంగణాన్ని యథాతథంగా కొనసాగించాలి", "విద్యార్థుల హక్కులను పరిరక్షించాలి" అంటూ నినాదాలు చేశారు.

విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలను పునఃసమీక్షించి, విద్యార్థుల భవిష్యత్తు, తెలుగు భాషా–సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Address

Hyderabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Potti Sreeramulu Telugu University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share