28/09/2024
మాతోపాటు జూలూరుపాడు ZPHS పాఠశాలలో చదువుకున్న మిత్రుడు, బాణోత్ నరసింహారావు(41), సాయిరాం తండా స్వగ్రామం నందు హఠాత్తుగా చనిపోయారు. అతని దశదిన కర్మకు, 1998 to 1999 సంవత్సరంలో ZPHS జూలూరుపాడులో చదువుకున్న 10th క్లాస్ బ్యాచ్ మిత్ర బృందం అందరూ కలిసి వారి భార్య బానోత్ రుక్మిణి గారినీ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మా వంతు ఆర్థిక సహాయాముగా (₹38000/-) ముప్పై ఎనిమిది వేల రూపాయలు అందించడం జరిగింది. అతనికి ముగ్గురు కుమార్తెలు కలరు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపేందుకు వచ్చిన మిత్రులు అందరికి ధన్యవాదాలు. ఆర్థిక సహాయం చేయడానికి మంచి మనసుతో స్పందించిన దేశ విదేశాల్లోని మా బ్యాచ్ అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా స్నేహితులు ఇప్పటికే పలు సందర్భాల్లో సకాలంలో స్పందించి కష్టకాలంలో సాటి మిత్రులకు చేయూతను అందించడానికి ముందుకొచ్చారు. ఇలాంటి కష్టకాలంలో ... ఇక ముందు కూడా మా హెల్పింగ్ హ్యాండ్స్ సిద్ధంగా ఉంటాయని మిత్రులందరం తెలియజేస్తున్నాము. జై హింద్.
ఈ కార్యక్రమంలో శిరిపురపు రాంబాబు, యల్లంకి నరేష్, నాగ కోటేశ్వరరావు, షేక్ కరిముల్లా, జేష్ఠ నరేష్, దాసరి రామకృష్ణ, నున్న నాగేశ్వరావు, నున్న మధు, దుద్దుకురి సురేష్, జి కృష్ణయ్య, గొడ్ల శ్రీను, ముత్యం, సుభాని, V చంద్రశేఖర్, s నరసింహరావు, J రాము, m శ్రీను, B రవి, M హనుమంతరావు, హలావత్ నరసింహరావు, పోలూరి నరేష్, ఎదులాపురం నరసింహరావు, కొలిపాక సురేష్, పెండ్యాల నరేష్, మాదినేని సతీష్, B మధు, J, H రఘుపతి, వీరన్న, మురళీ, ఉప్పర్ల రవి, B వెంకట రాములు, k కృష్ణ, R రవి , గువ్వల రఘురాం, మాతో పాటు చదువుకున్న అమ్మాయిలు మరియు తదితర మిత్రులు పాల్గొన్నారు.