28/03/2018
నాకు ఇప్పటికి గుర్తుంది, ఏడో తరగతిలో నన్ను నేసిన ఓ అందం, మా మాథ్స్ టిచర్ సరిత, సన్నగా క్యామెల్ స్కేల్ లా ఉండేది, ఆ నవ్వుని చూస్తే నాలో లెక్కలు రెక్కలు కట్టుకొని మరీ ఎగిరేవి.
తెల్లగా కొత్త క్లాస్మేట్ నోట్స్ లా కనిపించింది. కళ్ళద్దాలు పెట్టుకున్న కొత్త జెల్ పెన్ లా అనిపించేది. రొజూ రోజపువ్వులా
సరికొత్తగా అనిపించేది.
నిజానికి నేను లెక్కల్లో ఫస్ట్, కాని ప్రతీసారి డౌట్స్ అడగటానికి తన స్టాఫ్ రూమ్ కి వెళ్ళేవాడిని. ఎంచక్కా తనని అలా చూస్తూ లంచ్ బాక్ష్ ఓపెన్ చెయ్యకుండానే కడుపు నిండి పోయేంత ఆనందం కలిగేది.
మా మేడం చీరలో, అచ్చం కవర్ వేసిన కొత్త టెక్స్ట్ బుక్కులా ఉండేది. నిజానికి నా బ్యాగ్లో బుక్కులు పెడితే కలగురా గంపలా అయిపోయేది. ఎందుకో తెలియదు, ఎంత కొత్త పుస్తకమైన అట్ట ఊడిపోయి, పంచరైన టైర్ లా కనిపించేవి.
అప్పట్లో, మా నాన్న అదే పనిగా కొత్త పుస్తకాలకు అట్టలు వేసి మరీ స్కూల్ కి పంపేవాడు. కాని అవి నెలకే, బజ్జీలు కట్టే పొట్లం పుస్తకాలుగా అయ్యేవి.
మనకు ముందే, పుస్తకాలను కొంచెంగా రాయటం అలవాటు కదా, మా మాథ్స్ టీచర్ చెప్పే నోట్స్ కూడా నాకు నచ్చినట్టుగా షార్ట్స్ కట్స్లో రాసుకునేవాడిని. ఒకసారి మా మేడం అందరి పుస్తకాలను చెక్ చేస్తుంది. అప్పుడు నేను వెనుక బెంచ్ నుండి ముందుకొచ్చి కూర్చున్న, కాని ఎప్పటిలాగా వెనుక బెంచస్ నుండి కాకుండా ముందు బెంచ్ నుండే చెక్ చెయ్యడం మొదలుపెట్టింది. అంతే షార్ప్నర్ చేతిలో చిక్కిన పెన్సిల్ ముక్కలా, ఆవిడా చేతికి చిక్కను అంతే, ఎడిటర్ కట్స్ కి దడుచుకున్న డైరెక్టర్ లా అయ్యింది మా టిచర్ పరిస్థితి, ఆవిడ రాసే చాట భారతాన్ని కూడా నేను స్ప్రైట్ యాడ్ లో చెప్పిన్నట్టుగా , రాశాను. కాని దానికి ఆవిడా నాకు ఇచ్చిన పనిష్మెంట్.
రొజూ తను చెప్పే లెక్కలు ముందుగా నల్ల బోర్డ్ మీద రాయాలి. మనం టెక్స్ట్ బుక్ లోని మ్యాటర్ ని అలా అలా రాసేసేవాడిని.
ఒకరోజు హ్మ్వర్క్ చెయ్యలేదని క్లాసు బయట నిలబెట్టింది.
అంతే ఆరోజు ఆవిడకు క్లాస్స్ మధ్యలో వెళ్లి బర్త్డే అని చెప్పి చాకొలేట్ ఇచ్ఛా అంతే, ఆవిడ కోపం ఉష్కాకి అయ్యి, నన్ను లోపలికి వచ్చి కుర్చోమంది.
స్కేల్తో చెయ్యిని వెనుకకు తిప్పి కొట్టేది, కాని నాకెందుకో ఆవిడ నన్ను కొట్టడానికే పుట్టిందేమో, నేను ఆవిడని అలా చూస్తూ ఉండటానికే పుట్టనేమో అనిపించేది.
కాని కొన్నిరోజులకు, ఆవిడ భర్త వచ్చి పికప్ చేసుకొని వెళ్ళాడు. అప్పుడే తెలిసింది ఆవిడకు పెళ్లి అయ్యిందని.
అంతే, నా లెక్కలకు ఉన్న రెక్కలు కాస్త పటకున్న విరిగిపోయాయి.
అప్పటి నుండి, నేను ఆవిడని డౌట్స్ అడిగే వాడిని కాదు, హోమ్వర్క్ రెగ్యులర్ గా చేసేవాడిని.
అంతే, ఆవిడకు నాకు మాటలు లేవు, నేను క్లాసురుమ్లో ఉన్నానా, లేనా అన్నట్టుగా ఉండేవాడిని. నా పుస్తకంతో నేను స్నేహం చేస్తూ..
అప్పుడే ఏదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్, నాకు ఒక స్కూల్ లో పడింది. అక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు, ఒక పొడగాటి అమ్మాయిని చూసి ఫిదా అయ్యా.
భారత మాత వేషంలో కనిపించింది. అంతే తెల్లటి చీరలో అలా రెక్కలొచ్చిన పావురంలా ఎగిరాను.
అలా కొన్ని రోజులైంది, ఏడు ఎగ్జామ్స్ ఐపోయాయి, కాని ఆ స్కూల్ చుట్టే చెక్కర్లు కొట్టడం మొదలుపెట్టను ఎందుకంటే ఎలాగో మా అక్క అక్కడే చదివేది.
కాని కొన్ని రోజులకు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ని పరిచయం చేసి, తినే నా ఫ్రెండ్, నీకు అక్క అవుతుంది అనింది అంతే, ఆ అక్క ఎవరో కాదు నాకు రెక్కలిచ్చిన భరత మాత.
అంతే ఒక్కసారిగా స్కూల్లో రొజూ చెప్పే ప్లేడ్జ్ గుర్తొచ్చి నాలుక కర్చుకున్నాను,
అంతే ఏడో తరగతి కాస్త ఏడుకొండలెక్కినట్టుగా ఐపోయింది. ఏడుకొండలంటే ఫెయిల్ అయ్యాను అని కాదండోయ్ హాయిగా పాస్ ఐపోయాను. :p