26/12/2021
*📚✍ఇంటర్‌లో అర్ధ వార్షిక*
*పరీక్షలకు ఉమ్మడి ప్రశ్నపత్రం✍📚*
*🌻ఈనాడు, అమరావతి:* ఇంటర్మీడియట్ అర్ధ సంవత్సరం పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటిసారిగా ఇంటర్ విద్యామండలి అన్ని కళాశాలలకు ఉమ్మడి ప్రశ్నపత్రాన్ని పంపిస్తోంది. ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతి సెషన్‌కు పరీక్షలు ప్రారంభమయ్యే గంటన్నర ముందు ప్రిన్సిపల్ ఫోన్‌కు పాస్‌వర్డ్ పంపిస్తారు. ప్రిన్సిపాళ్లు కళాశాల లాగిన్‌లో పాస్‌వర్డ్‌తో ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, జెరాక్సులు తీసి, విద్యార్థులకు అందించాలి. మూల్యాంకనం ఏ కళాశాలకు ఆ కళాశాలే నిర్వహిస్తుంది. అనంతరం మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కరోనా ఉద్ధృతి పెరిగి పరీక్షలను నిర్వహించలేకపోతే ఈ మార్కులనే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇