25/11/2025
కురగల్లు రైతు సొసైటీ లో భారీ మోసం… సీఈఓ రమేష్ బాబు పరారీ
కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈఓ రాయల రమేష్ బాబు డిపాజిటర్ల కోట్ల రూపాయల సొమ్మును మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానిక గ్రామ ప్రజల వద్ద ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుండి కోటి రూపాయల వరకు డిపాజిట్లు చేయించుకొని, దాదాపు ₹10 కోట్లకు పైగా సొమ్ము సేకరించిన తర్వాత పరారైపోయినట్లు సమాచారం.
కూలి చేసుకుని, చెమటోడ్చి సంపాదించిన జీవితకాలపు సొమ్మును ఇలా దోచుకోవటం వల్ల బాధితులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఈ సంఘటన వలన
రైతు సొసైటీలపై ఉన్న ప్రజాభిమానం, నమ్మకం పూర్తిగా పోయింది.
మంగళగిరి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న రమేష్ బాబును వెతికే చర్యలు ప్రారంభించారు.
ఫోటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు వెంటనే మంగళగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
https://www.youtube.com/watch?v=MOWF15xlg1E