MOHAN SAI

MOHAN SAI Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MOHAN SAI, PATHA MALAYEPALEM Road, Prathipadu.

02/12/2018

ఓం శ్రీ సాయి రామ్

తేదీ 4( ౪)డిసెంబర్ ౨౦౧౮(2018) అన్నదానం కి పాత మలాయీపాలెం temple వద్దకు సేవ చెయ్య వలేసన వారు తప్పనిసరి గా 7:30am లేదా 8:00 am time కి వుండాలి అందరూ ఆహ్వానితులే..

వివరాలు కొరకు
99498 39400 (వేణు గోపాల్),
సత్య సాయి సేవ సమితి,
గుంటూరు.

30/09/2017

🌞 GOOD MORNING BEST WISHES FOR VIJAYA DASAMI 🌞 శ్రీ కనకదుర్గమ్మ తల్లి చల్లని దీవెనలతో అందరికీ ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ విజయ దశమి శుభాకాంక్షలు సుప్రభాత శుభోదయము 🌞
🔯 🔯 🔯 🔯 🔯 🔯 🔯 🔯 🔯

12/08/2017
06/08/2017

ఆగస్ట్_7_సోమవారం_చంద్రగ్రహణం_మనం
#తెలుసుకోవలసిన_విషయాలు

ప్రారంభం: రా.గం.10:52 అంతం: రా.గం.12:48

#1గ్రహణశాంతి_ఎవరెవరు_చేసుకోవాలి?

ఈ గ్రహణం శ్రవణ నక్షత్రం లో జరుగుతుంది కాబట్టి శ్రవణ నక్షత్రం వారు మరియు మకరరాశి వారంతా విధిగా చేసుకోవాలని శాస్త్రం . అదీ కాక

"త్రిషడ్దశాయోపగతే నరాణాం
శుభప్రదం స్యాద్గ్రహణం రవీంద్వోః
ద్విసప్త నందేషు చ మధ్యమం స్యా
చ్ఛేషేష్వనిష్టం మునయో వదంతి."

అనగా జన్మరాశి నుండి 3,6,1౦,11 స్థానములందు గ్రహణం సంభవిస్తే అది శుభప్రదం. 2,7,9 రాశులయందు మధ్యమఫలం. 1,4,5,8,12 ల యందు అశుభం అని మహర్షులు తెలియజేస్తున్నారు. కాబట్టి మహర్షుల సలహాననుసరించి #మిథున_కన్య_తుల_కుంభ రాశులవారు కూడా శాంతి చేయించుకోవాలి.

జ్యోతిషశాస్త్రానుసారం #వివిధరాశులపై #గ్రహణఫలితాలు ఇలా ఉన్నాయి.

మేషం - సుఖం * వృషభం - మాననాశము *
మిథునం - మృత్యుతుల్య కష్టం * కర్కాటక - స్త్రీకష్టం *
సింహం - సౌఖ్యమ్ * కన్య - చింత * తుల - శరీరపీడ *
వృశ్చికం - ధనలాభం * ధనుస్సు - క్షతి *
మకరం - ఘాతము* కుంభం- హాని* మీనం - లాభం
పైన పేర్కొన్న ఫలితాలు 6 నెలలలో జరుగుతాయి.

2. #శాంతి_ఏమి_చేయించుకోవాలి?
గ్రహణశాంతికి జ్యోతిష, ధర్మశాస్త్ర గ్రంథాలలో 3 రకాల శాంతులు చెప్పబడ్డాయి. అవి 1. బింబ దానం 2. మంత్ర స్నానం‌‌, 3. ఓషధీ స్నానం. వీటిలో ఏదో ఒకటి చేయించుకోవాలి.

3. #ఆరోజు_చేయకూడనివి_చేయవలసినవి_ఏమిటి?

A) రాత్రి రెండవఝూములో గ్రహణం కావున ముందు మూడు ఝాములు గ్రహణవేధ ఉంటుంది. కావున మధ్యాహ్నం 12గం.10ని. నుండి గ్రహణవేధ ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ లోపు భోజనాదులు పూర్తి చేసుకోవాలి. అయితే వృద్ధులు, రోగులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సాయంత్రం 4గం.56ని.లవరకు మినహాయింపు ఉంది. ఆ తరువాత వారు కూడా ఏదీ భుజించరాదు. ఇక మరీ ఉండలేనివారికి రాత్రి 8గం.8 ని. ల వరకూ ఏదైనా తేలికపాటి పదార్థాలు స్వీకరించవచ్చు.

B) రాత్రి 12గం.48ని.లకు మోక్షానంతరం మోక్షస్నానమాచరించి అందరూ మితాహారం చేయవచ్చు.

C) గ్రహణ సమయంలో నిద్ర వలన రోగము , మూత్ర విసర్జన వలన దారిద్ర్యము , మలవిసర్జన వలన కృమిరోగము , మైథునం వలన పందిజన్మ , అభ్యంగనం వలన కుష్ఠు రోగము , భోజనం వలన నరకము కలుగుతాయని శాస్త్ర వచనాలెన్నో ఉన్నాయి.

4. #గ్రహణంముందువండినవి_తర్వాత_పనికిరావా?

గ్రహణం ముందు వండుకున్నవి గ్రహణానంతరం తినకూడదు. అయితే దీంట్లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. గంజి , మజ్జిగ , నెయ్యి , పాలు వీటికి మరియూ వీటితో వండిన ఇతర పదార్థాలకీ కూడా దోషము లేదు. కానీ " కుశాంతరాళం కుర్వీత " అని ఉన్నది కావున వాటిలో దర్భలు వేసి ఉంచాలి.

5. #గ్రహణంలో_మంత్రజపం_చేయాలంటారు_అవునా?

" స్వస్వేష్ట దేవతా మంత్రజపం కుర్యాత్ప్రయత్నతః
యథాశక్తి జపేద్దేవీం గాయత్రీం ప్రయతస్సదా
చంద్రసూర్యోపరాగేతు మాలిన్యమజపాద్భవేత్."

అని పౌరాణిక , తాంత్రిక వచనములున్నాయి కనుక గ్రహణ సమయంలో ఇష్ట దేవతా మంత్రజపం చేయనియెడల మంత్రం మలినమైపోతుందని ఉన్నది కాబట్టి ఎవరెవరు వారి వారి గురువులవద్ద నుండి ఏయే మంత్రం గ్రహించారో వాటి జపం విధిగా చేయాలి. ఏమంత్రమూ లేనివారు ఉపనయనమైతే గాయత్రీజపమన్నా విధిగా చేయాలి. మిగిలినవారు సత్కాలక్షేపం చేయాలి.

6. #యజ్ఞోపవీతం_ఎప్పుడు_మార్చుకోవాలి?

ఉపాకర్మ చేసేవారు అందులో యజ్ఞోపవీతధారణ , దానము , హోమము ఇత్యాదులు ఉన్నాయి కాబట్టి వారు మాత్రమే విధిగా మార్చుకోవాలి. మిగిలినవారికి విధిగా మార్చుకోవాలన్న శాస్త్రనియమం లేనే లేదు. అయితే శ్రావణపౌర్ణమి అంటే జంధ్యాలపౌర్ణమి అనే నానుడి బాగా బలపడింది. అదే ఉపాకర్మ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పండితులు కూడా నిర్ణయం చేసారు.

7. #ఈగ్రహణానికి_ఇంకేమైనా_ప్రత్యేకత_ఉన్నదా?

ఉంది. చంద్రగ్రహణం సోమవారం నాడు వస్తే దానికి #చూడామణిగ్రహణం అని పేరు. దీనిగురించి శాస్త్రం

" వర్షేష్వన్యేషు యత్పుణ్యం గ్రహణే చంద్రసూర్యయోః
తత్పుణ్యం కోటిగుణితం గ్రాసే చూడామణౌ స్మృతమ్"

మామూలు చంద్రగ్రహణం కన్నా ఈ చూడామణి గ్రహణం
స్నాన , దాన , జప హోమాదులయందు కోటిరెట్లు ఫలితాన్ని ఇస్తుందని వ్యాసభగవానుని వచనం.

:- ఇందులో ఇచ్చిన గ్రహణవేధ సమయాలు రాజమండ్రి కి వర్తిస్తాయి. మిగిలినవారు వారి వారి ఊళ్ళకి time correction చేసుకోవాలి.

06/08/2017

*మంచి స్నేహం వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది. మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోను విలువైన స్నేహాన్ని జీవితాంతం నిలుపుకునే ప్రయత్నం చేయాలి. స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా... ఆ విలువైన బంధాన్ని అపురూపంగా కాపాడుకోవాలి.*

24/07/2017

శ్రావణ మాసం

సృష్టి,స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు,దుష్టశిక్షకుడు,శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం "శ్రావణ మాసం"

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రవణా నక్షత్రం" అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం.

శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.

పాడ్యమి - బ్రహ్మదేవుడు
విదియ - శ్రీయఃపతి
తదియ - పార్వతీదేవి
చవితి - వినాయకుడు
పంచమి - శశి
షష్టి - నాగదేవతలు
సప్తమి - సూర్యుడు
అష్టమి - దుర్గాదేవి
నవమి - మాతృదేవతలు
దశమి - ధర్మరాజు
ఏకాదశి - మహర్షులు
ద్వాదశి - శ్రీమహావిష్ణువు
త్రయోదశి - అనంగుడు
చతుర్దశి - పరమశివుడు
పూర్ణిమ - పితృదేవతలు

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు

శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని,సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

మంగళగౌరీ వ్రతం
శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.

వరలక్ష్మీ వ్రతం
మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణమాసంలో వచ్చే పండగలు

శుక్లచవితి-నాగులచవితి
మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి
ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ - రాఖీపూర్ణిమ
సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ - హయగ్రీవ జయంతి
వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం.హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.

కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి
క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.

కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి - కామిక ఏకాదశి
ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది.ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య
ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

16/07/2017

16/07/2017
దక్షిణాయణ పుణ్యకాలం ప్రారంభం.

కాలమును రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతేకాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశినుండి మరొక రాశిలోనికి ప్రతినెల మారుతుంటాడు. ఇలా మారుటనే సంక్రమణం అంటారు. ప్రవేశించిన ప్రతిరాశిలోను సూర్యుడు ఒక మాసముంటాడు. సూర్యుడు కర్కాటకరాశియందు ప్రవేశించినది మొదలు మకరరాశియందు ప్రవేశించు వరకు గల మధ్యకాలము దక్షిణాయనము. దక్షిణాయనమనగా భూమధ్యరేఖకు దక్షిణమున సూర్యుడు సంచరించు కాలము. శ్రావణమాసమునుండి పుష్యమాసము వరకు ఆరు నెలలు ఉండును.

ఏ శుభకార్యాలకైనా ఉత్తరాయనం మిక్కిలి శ్రేష్ఠము. దేవాలయం, తోటలు, బావులు మొదలగు వాని ప్రతిష్ఠలు దక్షిణాయనంలో చేస్తే ఫలితం లభించదు (నిర్ణయసింధువు)

గృహప్రవేశము, దేవతాప్రతిష్ఠ, వివాహము, చౌలము, ఉపనయనం, ఈ శుభకర్మలు ఉత్తరాయణంలో చేయాలి. నిందితమైన కర్మలు దక్షిణాయనంలో చేయాలి (నిర్ణయసింధువు)

దీనికి అపవాదము కాశీ ఖండంలో ఇలా ఉంది:
సదా కృతయుగం చాస్తు సదా చాస్తూత్తరాయనం
సదా మహోదయశ్చాస్తు కాశ్యాం నివసతాం సతాం!! ఇత్యయనం – కాశీఖండం!!

“ఎప్పుడూ కృతయుగం ఉండనీ ఎప్పుడూ ఉత్తరాయనం ఉండనీ, ఎప్పుడూ మోక్షం లభించనీ కాశీలో ఉండే సజ్జనులందరికీ” అని.

16/07/2017న సా 04గం:23 ని
సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన పుణ్యకాలం. ఈరోజునుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6గంటల 49నిమిషములు పుణ్యకాలంగా, 2గంటల 16నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.

భక్తి ఉంటేనే విలువ🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పూర్వం ఒక గ్రామంలో విష్ణు భక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరి నామస్మరణ చేస్తూ.. ధార్మిక జీవ...
09/07/2017

భక్తి ఉంటేనే విలువ
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
పూర్వం ఒక గ్రామంలో విష్ణు భక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరి నామస్మరణ చేస్తూ.. ధార్మిక జీవనం సాగించేవాడు. ఎంత పేదరికంలో ఉన్నా.. భగవానుడిపై ఆపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు. అతడి భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. స్వామి దివ్య మంగళ స్వరూపం చూసి.. తన్మయంతో స్తోత్రాలు చేశాడు భక్తుడు. స్వామికి ఏదైనా నివేదించాలని అనుకున్నాడు. ఇల్లంతా వెతకగా.. ఒక అరటి పండు కనిపించింది. దానిని స్వామికి నివేదించాడు. అరటిపండు ఒలిచి.. పండు పడవేసి... భక్తి పారవశ్యంలో.. తొక్కను స్వామి నోటికి అందించాడు. భక్త వత్సలుడైన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతర్ధానమయ్యాడు. తర్వాత తన తప్పును తెలుసుకుని భక్తుడు ఎంతో చింతించాడు. స్వామి పట్ల అపరాధం చేశానని కుమిలిపోయాడు. మళ్లీ స్వామి తనకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి తప్పు జరకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు సంపాదించి.. ప్రతి రోజూ ఒక డజను అరటిపళ్లు స్వామి విగ్రహానికి నివేదిస్తూ వచ్చాడు. ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం కాలేదు. బాధతో.. ‘తండ్రి! అపరాధి అయిన ఈ భక్తుడిని కరుణించి దర్శనం ఇవ్వమ’ని వేడుకున్నాడు. విష్ణుమూర్తి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. సంతోషంతో స్వామికి అరటి పళ్లు నివేదించాడు. గతంలో చేసిన పొరపాటు గుర్తు తెచ్చుకుని తొక్క పడవేసి.. పండు స్వామికి అందించాడు. కానీ, విష్ణుమూర్తి పండు తినడానికి ఇష్టపడలేదు. ఎంత బతిమాలినా ఫలితం లేదు. భక్తుడు ఆవేదనతో.. ‘నా భక్తిలో ఏదైనా లోపం ఉందా స్వామి! గతంలో తొక్క పెట్టినా తిన్నారు కదా! ఇప్పుడు ఇలా కినుక వహించారేమిటి?’ అని ప్రశ్నించాడు.

విష్ణుమూర్తి చిన్నగా నవ్వి.. ‘నాయనా! ఇంతకు ముందు వచ్చినప్పుడు నీ మనస్సు నాపై లగ్నం చేసి.. తొక్క నివేదించినా స్వీకరించాను. ఇప్పుడు నీ మనసు అరటి పండుపై లగ్నమై ఉంది. వస్తువు మంచిదైనా.. భక్తి రసహీనం కావడం వల్ల అది విషతుల్యంగా మారింది. అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను’ అని సమాధానమిచ్చాడు. స్వామి మాటలకు భక్తుడికి జ్ఞానోదయం అయింది. భక్తి కలిగినపుడే కదా దేనికైనా విలువ అనుకుని.. నిండు మనసుతో స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

09/07/2017

*వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే| నమో వై బ్రహ్మనిధ్యే వాసిష్ఠాయ నమోనమ:||*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*అందరికీ వ్యాసపూర్ణిమ/గురుపూర్ణిమ శుభాకాంక్షలు!*🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌸

23/04/2017

Good night..

29/03/2017

ఆదాయం "అంబాని" లాగా,
ఖర్చు "కామన్ మ్యాన్" లాగా,
రాజపూజ్యం "ఫుల్లుగా",
అవమానాలు "నిల్లుగా",
ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సబ్యులకు
"శ్రీ హేవలంబి నామ" ఉగాది శుభాకాంక్షలు....
మీ....

Address

PATHA MALAYEPALEM Road
Prathipadu
522019

Telephone

9030999961

Website

Alerts

Be the first to know and let us send you an email when MOHAN SAI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share