09/04/2019
Dear Alumni, Loyolites and students,
We cherish the opportunity of studying at Loyola Degree College. It is vital to remember the founders, donors of our college as they envisioned and contributed towards our bright future.
This post is a tribute to our donor, late Dr.Y.S.Raja Shekhar Reddy garu.
"రాజు గతించిన తర్వాత కూడా తను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తరువాత వచ్చిన వారు అమలుచేస్తున్నారంటే అది రాజు యొక్క గొప్ప పాలనకు నిదర్శనం అని చెప్పవచ్చు. వైయస్ఆర్ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఋణమాఫీ, ఫీ రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, 108, 104 వంటి అనేక సేవలను, పథకాలను ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టడమే కాక సమర్థవంతంగా అమలుచేశాడు. ఈ పథకాలు మరి కొన్ని దశాబ్ధాలు తెలుగు నేలపై ఉంటాయనడంలో సందేహం లేదు. వీటి రూపాలు(పేర్లు) మారవచ్చేమో గానీ మాతృక మాత్రం వైయస్ఆర్ ఆలోచనలే.
అయితే ఈ ఆలోచనలనంటికీ మూలం మహాప్రస్థానమే(పాదయాత్ర). 1470 కిలోమీటర్ల ఏకధాటి పాదయాత్రలో ఎంతో మంది ప్రజలను స్వయానా కలవడం ద్వారా, వారి హృదయాలను సృశిస్తూ వారి కష్టాలను దగ్గరి నుండి చూసినప్పుడు ఈ సంక్షేమ పథకాలు పురుడు పోసుకున్నాయి. 2003లో ఆయన చూసిన ప్రజల కష్టాలే 2004 ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో. అధికారంలోకి వచ్చిన తర్వాత 'మాట తప్పం.... మడమ తిప్పము' అన్న రీతిలోనే పథకాల అమలు జరిగింది. దీనికి తోడు వరుణదేవుడు కూడా సమాయాభావం పాటించడంతో ప్రజలు మునుపటి పాలన కన్నా సంతోషంగా ఉన్నారు.
ఆ మహాప్రస్థానం పాదయాత్ర ప్రారంభానికి నేటితో 14 ఏళ్ళు. ఎన్‌టి రామారావు గారి పాలన బాగుండేది అని విన్నాము కానీ వైయస్ఆర్ గారి పాలనను మేము కళ్ళారా చూశాము. ముమ్మాటికీ వైయస్ఆర్ పాలన సూపర్. అందుకే మహానేతను పాదయాత్ర ప్రారంభం సంధర్భంగా ఒకసారి స్మరించుకుందాం."
Content by: Karunakar Gangeddula
Regards,
Team LDC.