14/10/2017
16 సంస్థల్లో 524 ఖాళీలు రాజధాని యువతకు అవకాశం
అమరావతి :రాజధాని గ్రామాల్లోని యువతీ యువకులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యా భివృద్ధి సంస్థ, ఏపీ సీఆర్డీయే సంయుక్తంగా ఈ నెల 17వ తేదీన మంగళగిరి మండలంలోని నవులూరులో భారీ జాబ్ మేళాను నిర్వ హించనున్నాయి. టెక్ మహీంద్ర, టాటా స్ట్రైవ్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలతోపాటు హెచ్ డీఎఫ్‌సీ బ్యాంక్, బిర్యానీకి దశా బ్దాలుగా ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్ వంటి మొత్తం 16 కంపెనీలు పాల్గొంటున్నాయి. దీని ద్వారా పలు క్యాట గిరీలకు చెందిన మొత్తం 524 ఉద్యోగాలను రాజధానిలోని 27 గ్రామాల యువత పొందే అవకాశం లభించనుంది. 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా మొదలుకుని సాధారణ డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా.. వివిధ విద్యార్హతలతో లభించే ఈ ఉద్యోగాల నెలవారీ వేతనాలు రూ.7 వేల నుంచి రూ.20,000 వరకు ఉన్నాయి. విజయ వాడ, గుంటూరు, హైదరాబాద్, చెన్నైల తోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాల్లో పోస్టింగులు ఇస్తారు.
నవులూరులోని అమరావతి స్కిల్ డెవ లప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో పాల్గొనదలచిన రాజధాని యువతకు ఒక రోజు ముందు అంటే 16వ తేదీన తుళ్లూరులోని ఎస్.ఆర్.వి.ఎస్.ఆర్. అండ్ ఎన్.ఎస్.ఆర్. జూనియర్ కళాశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు సీఆర్డీయే డైరెక్టర్ (ల్యాండ్స్) బి.ఎల్.చెన్నకేశవరావు తెలిపారు. వివరాల కోసం గ్రామాల్లోని సీఆర్డీయే కార్యాలయాల్లో ఉండే ఫెసిలిటేటర్ లేదా 95057 19172, 97000 25833 ఫోన్ నెంబర్లను సంప్రదించాల్సిందిగా సూచించారు.
కాగా.. జాబ్ మేళాలో పాల్గొననున్న కంపెనీలు, వాటిల్లోని ఉద్యోగాలు, సంఖ్య, విద్యార్హతలు, వేతనం, పోస్టింగ్ ప్రదేశం తదితర వివరాలిలా ఉన్నాయి..
టెక్ మహీంద్రా- వాయిస్ అండ్ నా న్ వాయిస్, ఖాళీలు.. 49, డిగ్రీ, రూ.20,000, హైదరాబాద్.టాటా స్ర్టైవ్- మల్టీ డిజిగ్నేషన్స్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, బీఎస్‌సీ (ఫెయిల్), 10వ తరగతి ఆపైన, 35, రూ.8,000- రూ.15,000, హైదరాబాద్.జెన్‌ప్యాక్ట్- మల్టీ డిజిగ్నేషన్స్, 48, డిగ్రీ, రూ.20,000, హైదరాబాద్.సన్ ఐకాన్ సిస్టమ్స్- హెచ్.ఆర్., 12, ఎంబీఏ (హెచ్.ఆర్.), రూ.15,000, హైదరాబాద్.హెచ్‌జీఎస్- వాయిస్ అండ్ నాన్ వాయిస్, 130, డిగ్రీ లేదా పీజీ, రూ.10,000- రూ.12,000, గుంటూరు, హైదరాబాద్, చెన్నై.ఏక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్- బీడీఎం, 42, డిగ్రీ, రూ.12,000, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- బీడీఎం, 53, ఎంబీఏ, రూ.13,500, విజయవాడ, హైద్రాబాద్.ఏజిస్- వాయిస్ అండ్ నాన్ వాయిస్, 57, డిగ్రీ, రూ.8500- రూ.10,500, విజయవాడ, చెన్నై.శ్రీ కిరణ్ డయాబెటిస్ కేర్- నర్సింగ్, 4, ఏఎన్‌ఎం లేదా జీఎన్‌ఎం, అనుభవం ఆధారంగా వేతనం, విజయవాడ.డైమండ్ మెడికేర్- మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, 4, డిగ్రీ, రూ.8,000- రూ.15,000, విజయవాడ.ఫ్యూచర్ వెబ్ టెక్నాలజీస్- సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, 2, డిగ్రీ, రూ.10,000, విజయవాడ.న్యూ గోల్డెన్ టైర్స్- హెల్పర్లు, 5, ఎస్.ఎస్.సి., రూ.10,000- రూ.15,000, విజయవాడ.న్యూ గోల్డెన్ టైర్స్- మార్కెటింగ్, 5, ఎంబీఏ, రూ.10,000- రూ.15,000, విజయవాడ.ప్యారడైజ్ హోటల్- వెయిటర్స్, షెఫ్‌లు, కెప్టెన్, 25, ఎస్.ఎస్.సి.- ఏదైనా పీజీ, రూ.8,000- రూ.15,000, విజయవాడ.పార్థు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్- హెచ్.ఆర్.,1, ఎంబీఏ, రూ.15,000, విజయవాడ.స్టీన్‌మెట్జ్- జావా, పీహెచ్‌పీ, ఆండ్రా యిడ్, 2, బీటెక్, రూ.10,000, విజయవాడ.స్మైల్ కన్సల్టింగ్ సర్వీసెస్- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఎఫ్‌ఎంసీజీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, 50, ఎస్.ఎస్.సి- డిగ్రీ, రూ.7,000- రూ.12,000, విజయవాడ