13/12/2025
శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఎంజీఎం విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆహ్వానించిన MGM విద్యా సంస్థలు డైరెక్టర్ డాక్టర్ మయూర్.*
శ్రీకాళహస్తి నందు MGM విద్యా సంస్థలు 2001వ సంవత్సరంలో శ్రీ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గారు, శ్రీ నారా రామమూర్తి నాయుడు గార్ల చేతుల మీదుగా ప్రారంభమైన ఎంజీఎం విద్యాసంస్థలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న విషయం MGM విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి గారికి వివరించారు. అనంతరం MGM విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ గారు శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి గారిని సాదరముగా ఆహ్వానించారు. ఎంజీఎం విద్యాసంస్థలు సిల్వర్ జూబ్లీ వేడుకలు 2026 జనవరి నెలాఖరున జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమమునకు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు గౌరవ అతిథిగా,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణ శాఖ మంత్రి రాజానగరం మాజీ శాసనసభ్యులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు గౌరవ అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా MLA సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ మా నాన్న గారు శ్రీ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంబించబడ్డ MGM విద్యా సంస్థల సిల్వర్ జూబిలీ వేడుకలకు తాను తప్పక హాజరువుతానని MGM డైరెక్టర్ డాక్టర్ మయూర్ కు తెలిపారు.