05/09/2019
👉ఈ రోజు తేది 05-09-2019 గౌరవ రాష్ట్రపర్యాటక, క్రీడ శాఖ మంత్రి
శ్రీ ముత్తంశెట్టి.శ్రీనివాసరావు గారు భారత రెండవరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి.రాధాకృష్ణన్ జయంతి వేడుకలు తగరపువలస అవంతి కాలేజీలోనిర్వహించారు. భీమిలి నియోజకవర్గానికి చెందిన 1500 మంది ఉపాధ్యాయులందరికి మంత్రివర్యులు
చేతులమీదుగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు
👉ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మన తల్లి తండ్రులు మనకు జన్మనిస్తే మన భవిష్యత్తును తీర్చిదిద్దేది మన ప్రవర్తనను రూపు దిద్దేది మాత్రం ఉపాధ్యాయులే అనిఅన్నారు
ఉపాధ్యాయులు మన భారత దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు ఉపాధ్యాయులనని వారిని గౌరవించడం, సత్కరించడం మన దేశాన్ని గౌరవించినట్టే అని అన్నారు
ఈ కార్యక్రమంలో J.C శివశంకర్ గారు,D.E.O లింగేశ్వరరెడ్డి,Deputy D.E.O ఉపాధ్యాయులందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.