02/06/2025
ఘనంగా జరిగిన స్కాలర్స్ డాక్టర్స్ ఆత్మీయ సమ్మేళనం
“స్కాలర్స్ అకాడమి"ని ప్రారంభించిన డాక్టర్లు
నేడు వనపర్తిలోని ఒక ప్రైవేటు బాంకెట్ హాలులో స్కాలర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి డాక్టర్లుగా స్థిరపడిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ కళాశాలలోని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అలనాటి గురువుల భోదన తీరును, వారి ప్రేరణను కొనియాడుతూ వారిని సన్మానం చేయడం జరిగింది. అదే సమయంలో డాక్టర్లనందరిని శాలువా మరియు మెమెంటోలతో యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ మీరందరు సేవా దృక్పథంతో మీ వృత్తికి న్యాయం చేస్తూ పేదవారికి చేయుతనివ్వాలని పేర్కొన్నారు.
- "స్కాలర్స్ అకాడమిని” ప్రారంభించిన డాక్టర్లు
ఇంటర్ విద్యలో 35 సం ల సుదీర్ఘ అనుభవం కలిగిన స్కాలర్స్ యాజమాన్య ఆద్వర్యంలో నిర్వహించబోయే NEET, JEE అకాడిమిని డాక్టర్లు ప్రారంభించారు. లక్షల రూ॥లు వెచ్చించి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళకుండా మన వనపర్తి లాంటి ప్రాంతాలలో తక్కువ ఫీజుతో NEET, JEEలాంగ్ టర్మ్ కోచింగ్ ను నేడు వనపర్తిలో స్కాలర్స్ ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. వివిద కార్పోరేట్ కళాశాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన లెక్చరర్లచే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు NEET, JEE లాంగ్టర్మ్ కోచింగ్ ఇవ్వబడును. మరియు అదే కార్పోరేట్ లెక్చరర్లచే Regular Inter Bi.P.C + NEET రియు Regular Inter M.P.C + JEE ప్రథమ సం॥ నుండే కోచింగ్ ఇవ్వబడునని యాజమాన్యం పేర్కొన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో యాజమాన్య సభ్యులైన డా॥ పి.జగదీశ్వర్, డా॥ జి. వరప్రసార్ రావు, డా॥ ఎల్. సత్యనారాయణ రెడ్డి మరియు డా॥ బి. నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న డాక్టర్లు
డా॥ వినోద్
న్యూరోఫిజియన్ కిమ్స్ సన్లైన్ హాస్పిటల్, హైదరాబాద్
డా॥ రఘువీర్ రెడ్డి అనస్తీషియన్ సన్ షైన్ హాస్పిటల్, హైదరాబాద్
డా॥ కార్తికేయరాజ్ జనరల్ సర్జన్ మెడిసటి హాస్పటల్, హైదరాబాద్
డా|| సత్యనారాయణ
అనస్తీషియన్ ఏరియా హాస్పిటల్, జడ్చర్ల
డా॥ శంకర్ గోల్డ్ మెడలిస్ట్
ఆర్.ఎమ్.ఓ
పేట్లబుర్జు, హైదరాబాద్
డా|| శ్వేత
గైనకాలజిస్ట్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, నాగర్కర్నూల్
দেশ। జనరల్ సర్జన్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, నాగర్కర్నూల్
డా ॥ శ్రీను
ఇ.ఎన్.టి సూపరింటెండెంట్, ఎరియా హాస్పిటల్, కొల్లాపూర్
డా॥ క్రాంతికిరణ్ పిడియాట్రిక్స్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, నారాయణపేట్
డా॥ ఎల్. హరిత
పాథాలజి ఉస్మానియా మెడికల్ కళాశాల, హైదారాబాద్
డా|| అర్షియా,
ఫార్మాకాలజి ప్రభుత్వ మెడికల్ కళాశాల, వనపర్తి
డా॥ బి.భావన
అనస్తీషియన్
కిమ్స్సన్షైన్, హైదరాబాద్
వీరితోపాటు వనపర్తిలోని డెంటిస్ట్ డాక్టర్లు
డా॥ హరిత, డా|| చైతన్యకృష్ణ, డా॥ సుధాకర్, డా॥ శివకుమార్, డా॥ నిఖిత, ఫిజియోథెరపిస్ట్ డా|| వేమన పాల్గొన్నారు.