18/10/2025
ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఉదృతంగా బందు విజయవంతం Student Union Joint Warangal District
బీసీ లకు 42% రిజర్వేషన్స్ కలిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం అధ్యక్షులు బొమ్మ రంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ నిర్వహించడం జరిగింది. ప్రజలు,విద్యాసంస్థలు,విద్యార్థులు,యువకులు,వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ బీసీ లకు 42% రిజర్వేషన్స్ కలిపించకనే స్థానిక ఎన్నికల లకు పోవాలని అన్నారు. బంద్ ను అందరు స్వచ్ఛందంగా పాటించాలని అన్నారు. బీసీ లకు రాజ్యధికారం వచ్చే వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు ప్రకటించాలని పిలుపునిచ్చారు,బంధులో ప్రజా సంఘాలు బీసీ సంఘాలు కుల సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొన్నా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ శివానంద్ ,రాష్ట్ర నాయకురాలు సరస్వతి,
ఉమ్మడి జిల్లా విద్యార్థి సంఘం నాయకులు యెమూల.రాజేష్,రంగు.శివకుమార్,మార్కండయ,శరత్.
యువ నాయకులు చిరంజీవి,జాతీయ నాయకులు ఎల్లయ్యా, రమేష్ గౌడ్,బీసీ నాయకులు
బగ్గి రాజు,తదితరులు పాల్గొన్నారు